వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రైతులు ఆందోళన నిర్వహించారు.
ఎనుమాముల మార్కెట్‌లో రైతుల ఆందోళన
Mar 30 2017 3:18 PM | Updated on Jun 4 2019 5:16 PM
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రైతులు ఆందోళన నిర్వహించారు. ఐదురోజుల సెలవుల అనంతరం ఈ రోజు మిర్చీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజుల నుంచి మిర్చీ అమ్ముకోకుండా అక్కడే వేచి ఉన్న రైతులకు పెద్ద షాక్ తగిలింది. భారీగా మిర్చీ ధర పడిపోవడంతో.. ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యదర్శి కార్యాలయం ఎదుట పంటకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.
Advertisement
Advertisement