విద్యాభివృద్ధితోనే పేదరికం నిర్మూలన సాధ్యమని నగరసభ స్థాయి సమితి అధ్యక్షుడు తిమ్మారెడ్డి పేర్కొన్నారు.
విద్యాభివృద్ధితోనే పేదరిక నిర్మూలన
Sep 18 2013 3:31 AM | Updated on Jul 11 2019 5:01 PM
రాయచూరు సిటి, న్యూస్‌లైన్ : విద్యాభివృద్ధితోనే పేదరికం నిర్మూలన సాధ్యమని నగరసభ స్థాయి సమితి అధ్యక్షుడు తిమ్మారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఎల్‌బీఎస్‌నగర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పిల్లల హక్కుల క్లబ్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు విద్యావంతులైనప్పుడే కష్టాలను, పేదరికాన్ని అధిగమించవచ్చన్నారు. కనీసం ప్రతి విద్యార్థీ టెన్‌తవరకు చదవాలన్నారు. ఈ సందర్భంగా రాయచూరులోని కొరవ కాలనీకి చెందిన 49 మంది పిల్లలను తిరిగి పాఠశాలలకు చేర్పించారు. కార్యక్రమంలో యునిసెఫ్ అధికారి రాఘవేంద్ర భట్, శ్రీనివాస్, కృష్ణ మూర్తి, ఇక్బాల్, బాబు, వీరేష్, మరియప్ప గౌడ, ఆర్. వాణి, నాగరాజ్, అనిల్‌కుమార్, రూప, భాగ్యశ్రీలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement