'కార్పొరేట్ రంగాలకు బాబు సర్కార్ దాసోహం' | cpi ramakrishna slams ap govt over reservations and corporate sectors | Sakshi
Sakshi News home page

'కార్పొరేట్ రంగాలకు బాబు సర్కార్ దాసోహం'

Oct 6 2016 2:02 PM | Updated on Sep 22 2018 8:07 PM

'కార్పొరేట్ రంగాలకు బాబు సర్కార్ దాసోహం' - Sakshi

'కార్పొరేట్ రంగాలకు బాబు సర్కార్ దాసోహం'

చంద్రబాబు సర్కార్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోందని రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అగ్రకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, రావెల కిషోర్బాబు ఎందుకు మాట్లాడటం లేదని..? ఆయన ప్రశ్నించారు. దీనిపై సీఎంకు లేఖ రాస్తే ఇప్పటికీ సమాధానం రాలేదన్నారు. కార్పొరేట్ రంగాలకు చంద్రబాబు సర్కార్ దాసోహమైందని రామకృష్ణ విమర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement