తాలూకాలోని అత్తికుంటె నివాసి, సీపీఐ నాయకుడు టీ రాధాకృష్ణ (40) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు.
ముళబాగిలు, న్యూస్‌లైన్ : తాలూకాలోని అత్తికుంటె నివాసి, సీపీఐ నాయకుడు టీ రాధాకృష్ణ (40) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో పట్టణ శివార్లలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాధాకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అత్తికుంటెలో నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఎవరైనా తగాదా పడితే పంచాయితీ నిర్వహించి రాజీ కుదుర్చేవారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి పట్టణ సమీపంలో గ్రామానికి చెందిన ఓ వర్గం వారు నిర్వహించిన డిన్నర్‌కు హాజరైన రాధాకృష్ణ ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో పట్టణ శివార్లలో హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా రాధకృష్ణను తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, నాయకులు కేవీ శంకరప్ప, ఎం గోపాల్ ఆస్పత్రికి వెళ్లి హతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదిలా ఉండగా రాధాకృష్ణ హత్య విషయం తెలుసుకున్న సీపిఐ కార్యకర్తలు శుక్రవారం పట్టణంలో బంద్ నిర్వహించారు.
దుకా అంబేద్కర్ సర్కల్ వరకు ప్రదర్శన నిర్వహించి దుకాణాలను బంద్ చేయించారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. అదనపు ఎస్పీ, తహశీల్దార్ ఏకేష్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాతకక్షలతోనే హత్య జరిగిందని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.