బ్యాంకర్లతో చంద్రబాబు సమీక్ష
పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఆర్‌బీఐ అధికారులతో సీఎం సమీక్షించారు.
అమరావతి: పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఆర్‌బీఐ అధికారులతో సోమవారం సమీక్షించారు. విజయవాడ కేంద్రంగా అనుక్షణం పరిస్థితిని గమనిస్తుండాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే రైతు బజార్లలో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో రూ.50 నోట్లను అందుబాటులోకి తేవాలని కోరారు. నోట్ల అవసరాలకనుగుణంగా బ్యాంకు, ఆర్‌బీఐ అధికారులు వేగంగా స్పందించాలన్నారు. కొత్తగా విడుదల చేసిన రూ. 500 నోట్లను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ అధికారులకు సూచించారు.