ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతీని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమ్‌నాథ్ భారతితోపాటు పలువురు
సోమ్‌నాథ్‌ను తొలగించాలి: బీజేపీ
Jan 19 2014 11:36 PM | Updated on Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతీని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమ్‌నాథ్ భారతితోపాటు పలువురు ఆప్ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.‘ఆప్ తరహా ప్రభుత్వ పాలనకు సోమ్‌నాథ్ ఓ ఉదాహరణ. త్వరలోనే ఢిల్లీవాసులు ఆప్ సర్కార్ నుంచి విముక్తి పొందుతారు’అని పేర్కొన్నారు. ఎన్నో విలువల గురించి చెప్పే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే ఆప్ ప్రభుత్వం, మంత్రులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల రాజకీయ విలువల గురించి మాట్లాడే ముందు తన ఇల్లు చక్కబెట్టుకుంటే సరిపోతుందని కే జ్రీవాల్‌కి సూచించారు. ‘నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమ్‌నాథ్ భారతి అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేసే ప్రొఫెషనల్ లెసైన్స్ రద్దవుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నార’ని గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement