కౌశల్‌ ఆర్మీని విస్తరిస్తా.. | Bangalore Kaushal fans Honored By Vijaya Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

కౌశల్‌ ఆర్మీని విస్తరిస్తా..

Oct 15 2018 8:34 AM | Updated on Jul 18 2019 1:53 PM

Bangalore Kaushal  fans Honored By Vijaya Bhaskar Reddy  - Sakshi

సాక్షి బెంగళూరు: భవిష్యత్తులో కౌశల్‌ ఆర్మీని మరింతగా విస్తరిస్తానని బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌–2 విజేత కౌశల్‌ మండ స్పష్టం చేశారు. కౌశల్‌ ఆర్మీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కౌశల్‌ బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు మారతహళ్లిలోని తులసి థియేటర్‌లో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌–2 విజేత అయ్యేందుకు సహకరించిన ప్రతిఒక్క ఆర్మీ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. తన అభిమానులంతా కౌశల్‌ ఆర్మీ పేరిట సమాజ సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

 భవిష్యత్తులో కూడా ఇలా సేవా కార్యక్రమాలను కొనసాగించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అనంతరం ఐటీపీఎల్‌లో ఉన్న బిర్యానీ జోన్‌కు వెళ్లి అభిమానులతో కలసి భోజనం చేశారు. బిర్యానీజోన్‌ యజమానులు విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలు కౌశల్‌కు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇక్కడి బిర్యానీ రుచికి ఫిదా అయిన కౌశల్, తెలుగువారి ప్రత్యేక డిష్‌ అయిన బిరియానిని బెంగళూరు వాసులకు అందజేస్తున్న విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలను అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement