పొత్తు ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూ రావడంతో, ఇక భారాన్ని దేవుడి మీద వేసి తమ ఎన్నికల పనులకు శ్రీకారం
కమలాలయంలో యాగాది పూజలు
మళ్లీ జవదేకర్ రాక
రంగంలోకి అమిత్ షా
సాక్షి, చెన్నై : పొత్తు ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూ రావడంతో, ఇక భారాన్ని దేవుడి మీద వేసి తమ ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఇక, దేవుడే దిక్కు అన్నట్టుగా కమలాలయంలో మంగళవారం వేకువజామున యాగాలు, ప్రత్యేక పూజలతో ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కమలనాథుల ప్రయత్నాలు బెడిసి కొడు తూ వస్తున్న విషయం తెలిసిం దే. తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు కసరత్తులు జరిగి నా, దోస్తీకి సిద్ధపడి ముం దుకు వచ్చే వాళ్లు కరువయ్యా రు.
ఇక, తమను ఎవరైనా అక్కున చేర్చుకుంటారా..? అన్న ఎదురు చూపుల్లో పడ్డా మిశ్రమ స్పందనే. చివరకు అమ్మే ది క్కు అన్నట్టుగా వ్యా ఖ్యలు సంధించినా, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వైపు నుంచి స్పందన శూన్యం. దీంతో రాష్ట్రంలో ఎన్నికల పర్యవేక్షణకు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ పొత్తు మంతనాల్లో పడ్డారు. రెండు రోజులు చెన్నైలో తిష్ట వేసి కుస్తీలు పట్టినా, ప్రయోజనం లేనట్టే.
గంపెడు ఆశతో వచ్చి ఒట్టి చేత్తో ఆయన ఢిల్లీకి వెను దిరగాల్సి వచ్చింది. తాము చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూ రావడంతో ఇక భారాన్ని దేవుడి మీద వేసి తమ ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టే పనిలో రాష్ట్రంలోని కమలనాథులు నిమగ్నమయ్యారు. ఇందు కోసం యాగాలు, ప్రత్యేక పూజలతో దేవుడి ఆశీస్సులతో పాటుగా ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
యాగాది పూజలు : టీ నగర్‌లోని కమలాలయంలో ఆవరణలో ఉదయం నాలుగున్నర గంటల నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ పూజల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నాయకులు మోహన్ రాజులు, ఇలగణేషన్, పాల్గొన్నారు. అక్కడి అమ్మవారి విగ్రహం వద్ద పూజల అనంతరం ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ, కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు.
మీడియాతో తమిళి సై మాట్లాడుతూ తమకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ అని, అందుకే విజయాలు వరించాలని కాంక్షిస్తూ దేవుడికి పూజల్ని నిర్వహంచామన్నారు. దేవుడ్ని స్మరించుకుంటూ సాగిన పూజల అనంతరం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. తాము చేస్తున్న ప్రయత్నాలకు విజయం చేకూరుతుందన్న నమ్మకం ఉందని, పరిస్థితులు అనుకూలంగా మారుతాయని వ్యాఖ్యానించారు.
బీజేపీ మీద, ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రజలకు నమ్మకం పెరిగిందని, అదే నమ్మకంతో ఇక్కడి పార్టీల తమ వెంట నడుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకాష్ జవదేకర్ బుధ లేదా గురువారం మరో మారు చెన్నైకు రానున్నారని పేర్కొన్నారు. ఆయన రాకతో పరిస్థితులు మారుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగనున్నారని, ఈ దృష్ట్యా రాష్ర్ట రాజకీయాల్లో పొత్తుల వ్యవహారంలో తమకు అనుకూల వాతావరణం ఏర్పడడం ఖాయం అని వ్యాఖ్యానించారు.