సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి | ACB Ride on Sub Registrar Office in jammalamadugu, ysr district | Sakshi
Sakshi News home page

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి

Aug 29 2016 2:42 PM | Updated on Aug 17 2018 12:56 PM

వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖరులు, సబ్‌ రిజిస్ట్రార్ సిబ్బంది దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి మితిమీరిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలకు దిగారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement