వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ఉన్న దంపతుల చేతిలో నుంచి మూడేళ్ల పాప కిందపడింది.
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి
Nov 10 2016 12:51 PM | Updated on Aug 30 2018 4:10 PM
నందిగామ: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ఉన్న దంపతుల చేతిలో నుంచి మూడేళ్ల పాప కిందపడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు చిన్నారి పై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద సంఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. నందిగామ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న బైక్‌ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారి చేతిలో ఉన్న పాప రోడ్డుపై పడిపోయింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇది గమనించకపోవడంతో.. చిన్నారి పై నుంచి బస్సు వెళ్లింది దీంతో చిన్నారి మృతిచెందింది.
Advertisement


