సాక్షితో కలిసి జీవా స్టెప్పులు..

Ziva Dhoni dances with mom Sakshi

ముంబై:  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గారాలపట్టి  జీవా తన డ్యాన్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.  ఓ పెళ్లి వేడుకకు ధోని కుటుంబం హజరైన క్రమంలో జీవా తన డ్యాన్స్‌తో  అదరగొట్టింది.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్‌ వివాహ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి మెహందీ ఫంక్షన్‌ జరిగింది. సాక్షి-పూర్ణ ఎప్పటి నుంచో స్నేహితులు. దీంతో సాక్షి కుటుంబసమేతంగా ఈ వేడుకకు హాజరైంది.   

ఈ కార్యక్రమంలో జీవా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లి సాక్షి చూపిస్తోన్న డ్యాన్స్‌ స్టెప్పులు వేసేందుకు ప్రయత్నిస్తూ జీవా ఆకట్టుకుంది. ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకుని తిరిగి భారత్‌ చేరుకున్న ధోని తన విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top