యూవీ పర్‌ఫెక్ట్‌ రిప్లై.. అక్తర్‌ బాధితుడు | Yuvaraj Perfect Reply trolled Shoaib Akhtar | Sakshi
Sakshi News home page

Dec 29 2017 11:02 AM | Updated on Oct 22 2018 6:05 PM

Yuvaraj Perfect Reply trolled Shoaib Akhtar - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : సోషల్‌ మీడియాలో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటాడు. అవతల ఉంది ఎవరైనా వారికి టైమింగ్‌ రిప్లైలు ఇచ్చి ఆకట్టుకుంటాడు.  తాజాగా పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ను ఉద్దేశించి చేసిన ఓ రీట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది.  

అక్తర్ ఈ మధ్య తన ట్విట్టర్‌లో తన ఫొటోతో కొటేషన్స్‌ను పోస్ట్ చేశాడు. ‘‘మీ లక్ష్యాల విషయంలో భయపడొద్దు. శ్రమకు ఎప్పుడూ ఫుల్‌స్టాప్ పెట్టొద్దు. మీ లక్ష్యాల విషయంలోనూ అంతే’’ అంటే అంటూ కళ్లద్దాలు పెట్టుకుని, చేతిలో హెల్మెట్ ఉన్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అయితే యువతలో ప్రేరణ రగిల్చేలా ఉన్న ఆ సందేశాన్ని తన రిప్లైతో యూవీ ఫన్నీగా మార్చిపడేశాడు. 

‘నువ్వు చెప్పింది చాలా బాగుంది కానీ.. వెల్డింగ్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నావ్’’ అంటూ రీట్వీట్ చేశాడు. అంతే యూవీ టైమింగ్‌ అమోఘం అంటూ.. అక్తర్‌ను పలువురు ట్రోలింగ్‌ చేసి పడేస్తున్నారు. సాధారణంగా సెహ్వగ్‌ నుంచి అభిమానులు ఇలాంటివి ఆశిస్తుంటారు. కానీ, ఇప్పుడు యూవీ నుంచి అది రావటం.. పైగా అక్తర్ వేషధారణకు సరిగ్గా సరిపోయేలా ఉ‍న్న ఆ రీట్వీట్‌ మీరూ చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement