బహిష్కరిస్తే మనకే నష్టం | Sakshi
Sakshi News home page

బహిష్కరిస్తే మనకే నష్టం

Published Mon, Dec 14 2015 2:12 AM

బహిష్కరిస్తే మనకే నష్టం

పీసీబీకి వసీం అక్రమ్ సూచన
 
కరాచీ: భారత్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌పై నాన్చుడు ధోరణికి నిరసనగా వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేయాలనే ఆలోచన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మానుకోవాలని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సూచించారు. ‘పాక్‌తో ఆడాల్సిన సిరీస్‌పై నిర్ణయం కోసం భారత్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్న విషయం నాకు తెలుసు.

అయితే ఇప్పుడు ఈ సిరీస్ జరగకపోయినా భవిష్యత్‌లో కచ్చితంగా ఉంటుంది. భారత్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను బహిష్కరించే ఆలోచన పీసీబీ మానుకోవాలి. ఎందుకంటే అది ఐసీసీ ఈవెంట్. ఎట్టి పరిస్థితిలోనైనా అందులో పాల్గొనాల్సిందే. అదే జరగకపోతే భవిష్యత్ లో మనకే నష్టం. రెండు జట్ల మధ్య సిరీస్‌లు జరిగినా జరగకపోయినా ఉగ్రవాదం మాత్రం అంతరించదు’ అని అక్రమ్ తేల్చి చెప్పారు.
 

Advertisement
Advertisement