మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌ | West Indies Loss Two wickets Against India | Sakshi
Sakshi News home page

Oct 12 2018 11:07 AM | Updated on Oct 12 2018 11:41 AM

West Indies Loss Two wickets Against India - Sakshi

వికెట్‌ తీసిన ఆనందంలో టీమిండియా

హైదరాబాద్‌: భారత్‌తో ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంచ్‌ విరామ సమయానికి వెస్టిండీస్‌ మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.  టాస్‌ గెలిచిన పర్యాటక జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత స్పిన్నర్లు అశ్విన్‌, కుల్‌దీప్‌లు ఇద్దరి ఓపెనర్లను పెవిలియన్‌ చేర్చారు. పోవెల్‌ (22)ను అశ్విన్‌ క్యాచ్‌ ఔట్‌ చేయగా.. బ్రాత్‌వైట్‌ (14)ను  కుల్దీప్‌ బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్‌, హెట్‌మెయిర్‌ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఉమేశ్‌ యాదవ్‌ హోప్‌(36) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేర్చాడు.  దీంతో విండీస్‌ 86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన శార్థుల్‌ ఠాకుర్‌ను దురదృష్టం వెంటాడింది. 10 బంతులు వేయగానే అతను గాయంతో మైదానాన్ని వీడాడు. 

Advertisement
 
Advertisement
Advertisement