‘జీవితంలో సోషల్‌ మీడియా ముఖం చూడను’

Waqar Younis Says He Will Delete Social Media Accounts - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ హ్యాకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురైనట్లు పేర్కొంటూ ఓ వీడియోను వకార్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సందర్బంగా ఈ మాజీ పేసర్‌ మాట్లాడుతూ.. తన సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురయ్యాయని,  హ్యాక్‌ అయిన సమయంలో తన అకౌంట్‌ నుంచి ఏదైనా పోస్ట్‌ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకండి అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఇక జీవితంలో సోషల్‌ మీడియా జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 

వకర్‌ యూనిస్‌ సోషల్‌ మీడియా అకౌంట్లను హ్యాక్‌ చేసిన హ్యాకర్లు పలు పోర్న్‌ వీడియోలు, ఫోటోలకు లైక్‌ కొట్టారు. అంతేకాకుండా పలు అసభ్యకరమైన పోస్టులను షేర్‌ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వకార్‌ తన టెక్నికల్‌ టీం సహాయంతో అన్ని అకౌంట్లను తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇక ఈ పేస్‌ బౌలర్‌ హ్యాక్‌కు గురవ్వడం ఇదే తొలి సారి కాదు గతంలో కూడా మూడునాలుగు సార్లు ఇలాగే ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో అసహనానికి లోనైన వకార్‌ ఇక జీవితంలో సోషల్‌ మీడియా జోలికి వెళ్లనని స్పష్టం చేశాడు. ఇన్ని రోజులు తనను ఫాలో అయిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా తన నిర్ణయంతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండంటూ వకార్‌ పేర్కొన్నాడు. 

చదవండి:
అందుకే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు
ప్రపంచకప్‌-2011 ఫైనల్‌: రెండుసార్లు టాస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top