పుతిన్‌ బంపరాఫర్‌!

Vladimir Putin Gives Fifa Fans Visa Free Russia Entry All Year - Sakshi

మాస్కో: ఫిఫా అభిమానులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బంపరాఫరిచ్చాడు. ప్రపంచకప్‌ టోర్నీ ముగిసినా.. విదేశీ అభిమానులు వీసా లేకుండా ఈ ఏడాదంతా రష్యాలో పర్యటించే అవకాశం కల్పించారు. అయితే ఇది ఫ్యాన్‌ ఐడీ కార్డులు ఉన్న విదేశీయులకు మాత్రమే వర్తించనుంది.

ఫిఫా ప్రపంచకప్‌ సందర్భంగా రష్యాకు వచ్చే విదేశీ అభిమానుల కోసం నిర్వాహకులు ఫ్యాన్‌ ఐడీలను జారీ చేశారు. ఈ ఐడీల కాలపరిమితి ఈ నెల 25 వరకు మాత్రమే ఉంది. ఆదివారంతో ఈ ప్రపంచకప్‌ టోర్నీ ముగియడంతో.. ఈ కార్డుల కాలపరిమితిని పెంచుతూ రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్‌ ఐడీలు కలిగిన విదేశీ అభిమానులు వీసా లేకుండానే ఈ ఏడాదంతా ఎన్నిసార్లైనా రష్యాలో పర్యటించొచ్చని ఫైనల్‌ అనంతరం పుతిన్‌ ప్రకటించారు. ఈ పోటీలను నిర్వహించినందుకు గర్వపడుతున్నామని తెలిపారు. మరోవైపు విజయవంతంగా ఫిఫా పోటీలు నిర్వహించినందుకు పలు దేశాలు రష్యాను అభినందించాయి.

ఆదివారం జరిగిన ఫైనల్‌లో క్రొయేషియాపై ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, క్రోయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌ హాజరయ్యారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top