కోహ్లీపై గవాస్కర్ సంచలన కామెంట్! | Virat Kohli is from undiscovered planet, says Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

కోహ్లీపై గవాస్కర్ సంచలన కామెంట్!

Dec 11 2016 8:59 PM | Updated on Sep 4 2017 10:28 PM

కోహ్లీపై గవాస్కర్ సంచలన కామెంట్!

కోహ్లీపై గవాస్కర్ సంచలన కామెంట్!

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విచిత్రమైన కామెంట్ చేశాడు.

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విచిత్రమైన కామెంట్ చేశాడు. విరాట్ మన గ్రహానికి చెందినవాడు కాదని, ఇంకా ఎవరూ కనిపెట్టని గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కోహ్లీ ఆటతీరు ఎంతో అత్యుత్తమంగా ఉందని అసలు అతని గురించి ఎలా చెప్పాలో కూడా తనకు అర్థం కావడం లేదని దిగ్గజ ఆటగాడు గవాస్కర్ పేర్కొన్నాడు. రోజురోజుకు అతడు ఎంతో రాణిస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

‘వన్డే, టెస్టులు, టీ20లు, ఐపీఎల్ ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా కోహ్లీ దూసుకుపోతున్నాడు. భారత్ బ్యాటింగ్ కు అతడు వెన్నెముక లాంటివాడు. కెప్టెన్ గా అతడు ఇంకా చాలా చిన్నవాడు. రోజు ఏదో ఒక విషయాన్ని అతడు నేర్చుకోవడం మంచిది. ముంబై స్డేడియంలో చివరి రోజు 150 స్కోరు ఛేదించడం అంత ఈజీ కాదు’  అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement