విజయ్‌కు రెండు పతకాలు | Vijay to the two medals | Sakshi
Sakshi News home page

విజయ్‌కు రెండు పతకాలు

Nov 13 2015 12:04 AM | Updated on Sep 3 2017 12:23 PM

ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మేటి షూటర్ విజయ్ కుమార్‌కు రెండు పతకాలు లభించాయి.

ఆసియా షూటింగ్
 
కువైట్ సిటీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మేటి షూటర్ విజయ్ కుమార్‌కు రెండు పతకాలు లభించాయి. 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో విజయ్‌కు కాంస్యం దక్కింది.

టీమ్ విభాగంలో సమరేశ్ జంగ్, పెంబా తమాంగ్, విజయ్‌ల త్రయం 1736 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో భారత్ 17 స్వర్ణాలు, 14 రజతాలు, 13 కాంస్యాలను సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement