రెండో రౌండ్‌లో విఘ్నేశ్ | vignesh entered in second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో విఘ్నేశ్

Mar 19 2014 12:18 AM | Updated on Sep 4 2018 5:07 PM

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-4 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి.

 ఐటీఎఫ్ టోర్నమెంట్
 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-4 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. విఘ్నేశ్, కాజా వినాయక్ శర్మ శుభారంభం చేయగా... క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన అశ్విన్ విజయరాఘవన్ తొలి రౌండ్‌లో ఓడిపోయాడు.
 
  తిరుచ్చిలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో విఘ్నేశ్ 4-6, 6-2, 7-6 (7/1)తో జానిస్ లినిగెర్ (స్విట్జర్లాండ్)పై; వినాయక్ శర్మ 6-2, 7-5తో నితిన్ కీర్తనే (భారత్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) 6-0, 1-0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అశ్విన్ విజయరాఘవన్ గాయంతో వైదొలిగాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్ కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement