వికెట్లను కొట్టినా ఔట్‌ కాలేదు!

Thomas Played The Shot The Bat Came Back To Disturb Bails - Sakshi

టాంటాన్‌: క్రికెట్‌లో హిట్‌ వికెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్‌మన్‌ తనకు తాను వికెట్లను కొడితే హిట్‌ వికెట్‌గా పరిగణిస్తారు. అది మన పరిభాషలో చెప్పుకోవాలంటే సెల్ఫ్‌ ఔట్‌ అంటాం. అయితే బ్యాట్స్‌మన్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టినా అది ఔట్‌ కాకపోతే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన కనిపించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ముస్తాఫిజుర్‌ 49 ఓవర్‌ ఐదో బంతిని ఆఫ్‌ సైడ్‌ యార్కర్‌గా సంధించాడు. అది కాస్తా స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న ఓష్నీ థామస్‌ దాటుకుని కీపర్‌ రహీమ్‌ చేతుల్లోకి వెళ్లింది.
(ఇక్కడ చదవండి: వెస్టిండీస్‌ ఇరగదీసింది)

ఆపై థామస్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. ఆ క్రమంలోనే బెయిల్స్‌ కూడా పడటం జరిగింది. దీనిపై అనుమానం వచ్చిన ఫీల్డ్‌ అంపైర్లు.. థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేశారు. కాగా, ఇది ఔట్‌ కాదని తేలింది. సదరు బంతిని థామస్‌ ఆడే క్రమంలో ఆ షాట్‌ పూర్తయిన తర్వాతే వికెట్లను బ్యాట్‌తో తాకడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇది పెద్ద విషయం కాకపోయినా, బ్యాట్స్‌మన్‌ వికెట్లను కొట్టినా ఎందుకు ఔట్‌ ఇవ్వలేదనేది సగటు క్రీడాభిమానికి వచ్చే ఆలోచన. కాగా, థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో దీనిపై స్పష్టత రావడంతో ఇదా విషయం అనుకోవడం అభిమానుల వంతైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top