రయీస్‌ పసిడి పంచ్‌

Raees

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌–జూనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు మొహమ్మద్‌ రయీస్‌ స్వర్ణం సాధించాడు. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన 46–48 కేజీల ఫైనల్‌ బౌట్‌లో రయీస్‌ 5–0తో బికాస్‌ (త్రిపుర)పై ఏకపక్షంగా విజయం సాధించాడు. మిగతా బౌట్లలో తెలంగాణ కుర్రాళ్లు రజతంతో తృప్తిపడ్డారు. 42–44 కేజీల విభాగంలో కె. ఆంజనేయులు 0–5తో మీసాల రవి (జార్ఖండ్‌) చేతిలో, 52–54 కేజీల కేటగిరీ ఫైనల్లో మధుసూదన్‌ యాదవ్‌ 0–5తో అజయ్‌ పటేల్‌ (రాజస్తాన్‌) చేతిలో పరాజయం చవిచూశారు.

ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్లలో జెర్రిపోతుల భానుప్రకాశ్, నెల్లి అభిరామ్‌ టైటిల్స్‌ సాధించగా... బాలగణేష్‌ రన్నరప్‌గా నిలిచాడు. 36–38 కేజీల ఫైనల్లో భానుప్రకాశ్‌ 5–0తో సాహిల్‌ సుభా (ఉత్తరప్రదేశ్‌)పై, 40–42 కేజీల తుదిపోరులో అభిరామ్‌ 5–0తో రూపేశ్‌ కుమార్‌ (రాజస్తాన్‌)పై విజయం సాధించారు. 32–34 కేటగిరీ టైటిల్‌ పోరులో బాలగణేష్‌ 0–5తో మనీశ్‌ సింగ్‌ (ఢిల్లీ) చేతిలో కంగుతిన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top