జాతికి క్షమాపణలు చెప్పిన లూయిజ్ | Tearful Brazil skipper Luiz apologises for defeat | Sakshi
Sakshi News home page

జాతికి క్షమాపణలు చెప్పిన లూయిజ్

Jul 9 2014 12:14 PM | Updated on Oct 22 2018 5:58 PM

జాతికి క్షమాపణలు చెప్పిన లూయిజ్ - Sakshi

జాతికి క్షమాపణలు చెప్పిన లూయిజ్

ప్రపంచకప్ లో ఓటమిపై తమ దేశానికి బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ డేవిడ్ లూయిజ్ క్షమాపణ చెప్పాడు.

బెలో హరిజోంటే: ప్రపంచకప్ లో ఓటమిపై తమ దేశానికి బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ డేవిడ్ లూయిజ్ క్షమాపణ చెప్పాడు. 'ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెబుతున్నా. బ్రెజిల్ ప్రజలందరికీ క్షమాపణలు' అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బ్రెజిల్ ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకున్నానని, కానీ దురదృష్టం తమను వెంటాడిందని వాపోయాడు.

జర్మనీ జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని తెలిపాడు. వారు బాగా సన్నద్దం అయ్యారని చెప్పాడు. ఓటమి తననెంతో బాధించిందని తెలిపాడు. ఇది తమకు బాధాకరమైన రోజుని, దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటామని చెప్పాడు. సెమీఫైనల్లో జర్మనీ చేతిలో బ్రెజిల్ 7-1 తేడాతో బ్రెజిల్ ఘోరంగా ఓడిపోయింది. వందేళ్ల ప్రపంచకప్ చరిత్రలో బ్రెజిల్ కు ఇది అత్యంత దారుణమైన ఓటమి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement