ఖో–ఖో విజేత సెయింట్‌ పాయ్స్‌ | St Payas wins Kho Kho Title | Sakshi
Sakshi News home page

ఖో–ఖో విజేత సెయింట్‌ పాయ్స్‌

Aug 4 2018 10:30 AM | Updated on Aug 4 2018 10:30 AM

St Payas wins Kho Kho Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎంసీఏ నారాయణగూడ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్గిల్‌ విక్టరీ స్పోర్ట్స్‌ మీట్‌లో సెయింట్‌ పాయ్స్‌ బాలికల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఖో–ఖో సీనియర్‌ బాలికల టైటిల్‌పోరులో సెయింట్‌ పాయ్స్‌ హైస్కూల్‌ 25–23తో మంచి స్కూల్‌ బాలాపూర్‌పై విజయం సాధించింది. జూనియర్‌ బాలుర ఫైనల్లో శ్రీవిద్య హైస్కూల్‌ 25–17తో శ్రీ మోడల్‌ హైస్కూల్‌ను ఓడించింది.

జూనియర్‌ బాలికల కేటగిరీలో బేగాస్‌ హైస్కూల్‌ 8–3తో సెయింట్‌ ఫిలోమినా హైస్కూల్‌పై గెలుపొందింది. మరోవైపు వాలీబాల్‌ ఈవెంట్‌లో శ్రీవిద్య సెకం డరీ స్కూల్‌ తిలక్‌నగర్‌ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రీవిద్య స్కూల్‌ 25–17తో దిల్‌సుఖ్‌నగర్‌ పబ్లిక్‌ స్కూల్‌ (కర్మన్‌ఘాట్‌)పై గెలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement