అతనిపై 4 మ్యాచ్‌లు... మీపై 12 నెలలా?

Smith On Nicholas Pooran's Short Ban For Tampering - Sakshi

బ్రిస్బేన్‌:  ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో అతనిపై నాలుగు టీ20 మ్యాచ్‌ల నిషేధ పడింది. అయితే ఇదే తరహాలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఇక డేవిడ్‌ వార్నర్‌ సైతం ట్యాంపరింగ్‌లో భాగం కావడంతో అతనిపై కూడా 12 నెలలు సస్పెన్షన్‌ పడగా, బెన్‌క్రాఫ్‌పై 9 నెలల నిషేధం విధించారు. అయితే పూరన్‌కు ఎందుకు స్వల్ప శిక్ష పడిందని స్టీవ్‌ స్మిత్‌ను అడగ్గా.. అలా అతనికి తక్కువ నిషేధం పడితే తనకేమిటి సంబంధం అని ఎదురు ప్రశ్నించాడు. అతనికి ఓ మోస్తరు శిక్ష  వేయడంతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నాడు.

‘ ప్రతీ ఒక్కరూ డిఫరెంట్‌.. ప్రతీ బోర్డు డిఫరెంట్‌. అక్కడ చాలా విషయాలు మిళితమై ఉంటాయి. నాకు కఠినమైన శిక్ష పడిందని నేనేమీ ఫీల్‌ కావడం లేదు. అది గతం. నేను గతం నుంచి ప్రస్తుతానికి వచ్చా. ఇప్పుడు వర్తమానంపై దృష్టి సారిస్తున్నా. నాకు నికోలస్‌ తెలుసు. అతనితో చాలా క్రికెట్‌ ఆడిన అనుబంధం ఉంది. అతనొక టాలెంట్‌ ఉన్న క్రికెటర్‌. పూరన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అతను చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్‌ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్‌ కారణంగా విండీస్‌ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్‌–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్‌ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్‌ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top