సెమీస్‌లో శివాని

shivani enters semis of Itf Tourney - Sakshi

ఐటీఎఫ్‌ జూనియర్స్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ జూనియర్స్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల విభాగంలో అమినేని శివాని సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు, డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. బాలుర విభాగంలో తీర్థ శశాంక్‌ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది.

గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో శివాని (భారత్‌) 6–3, 6–3తో షియోరి ఇటో (జపాన్‌)పై  గెలుపొందింది. మరోవైపు బాలికల డబుల్స్‌ సెమీస్‌లో టాప్‌ సీడ్‌ శివాని– ఆకాంక్ష (భారత్‌) ద్వయం 4–6, 6–3, 10–8తో చే హ్యూన్‌ (కొరియా)– డోగా (టర్కీ) జోడీపై గెలుపొందింది. బాలుర సింగిల్స్‌ క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్‌ (భారత్‌) 5–7, 4–6తో సచిత్‌ శర్మ చేతిలో పరాజయం పాలయ్యాడు.

Back to Top