ట్రై సిరీస్‌ ఫైనల్‌: షబ్బీర్‌ దూకుడు | Shabbir fifty helps bangladesh to 166 runs | Sakshi
Sakshi News home page

ట్రై సిరీస్‌ ఫైనల్‌: షబ్బీర్‌ దూకుడు

Mar 18 2018 8:56 PM | Updated on Mar 18 2018 8:58 PM

Shabbir fifty helps bangladesh to 166 runs  - Sakshi

కొలంబో:ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో తుది పోరులో బంగ్లాదేశ్‌ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షబ్బీర్‌ రెహ్మాన్‌ దూకుడుగా ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దాటిగా బ్యాటింగ్‌ చేసి బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు.

టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లిటాన్‌ దాస్‌(11), తమీమ్‌ ఇక్బాల్‌(15), సౌమ్య సర్కార్‌(1)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. అయితే షబ్బీర్‌ రెహ్మాన్‌ మాత్రం సమయోచితంగా చెలరేగి ఆడాడు. మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే, చెడ్డ బంతుల్ని బౌండరీ దాటించాడు. మొహ్మదుల్లా(21)తో కలిసి 36 పరుగుల్ని జత చేసిన తర్వాత షబ్బీర్‌ చెలరేగి ఆడాడు. ఆ క‍్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరింత ప్రమాదకరంగా మారాడు. కాగా, షబ్బీర్‌ ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో బంగ్లాదేశ్‌ స్కోరులో వేగం తగ్గింది. కాగా, చివర్లో మెహిదీ హసన్‌(19 నాటౌట్‌; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్‌ మూడు వికెట్లు సాధించగా, జయదేవ్‌ ఉనాద్కత్‌ రెండు వికెట్లు తీశాడు. వాషింగ్టన్‌ సుందర్‌కు వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement