ఆ లెక్కన కోహ్లి కూడా తప్పుకోవాలి

Sehwag Slams Kohli Decision over Dhawan set aside - Sakshi

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌ టీమిండియా జట్టును ఎంపిక చేసిన విధానంపై విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ ధావన్‌ను పక్కనపెట్టిన సెలక్షన్‌ కమిటీ-కోహ్లి నిర్ణయంపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా చేరిపోయారు. ఆ లెక్కన కోహ్లిపై కూడా వేటు పడాల్సిందేనని వీరూ చెబుతున్నారు.

‘‘ఒక్క టెస్టులో విఫలం అయినంత మాత్రానా ధావన్‌ను తొలగించాల్సిన అవసరం ఏంటి? కారణం లేకుండా భువనేశ్వర్‌ను కూడా పక్కకు పెట్టేశారు. ప్రస్తుతం సెంచూరియన్‌ టెస్ట్‌లో కోహ్లి రాణించకపోతే.. తర్వాతి టెస్టుకు తనంతట తానుగా తప్పుకోవాలి. ధావన్‌, భువీ విషయంలో సెలక్షన్‌ కమిటీ ఏ సూత్రాన్ని పాటించిందో.. అదే నిర్ణయాన్ని కోహ్లి విషయంలోనూ అమలుపరచాలి’’ అని సెహ్వాగ్‌ డిమాండ్‌ చేస్తు‍న్నారు. 

కేప్‌టౌన్‌లో జరిగిన మొదటి టెస్టులో భువీ ఆరు వికెట్లు తీయటంతోపాటు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనప్పటికీ.. అశ్విన్‌తోపాటు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయినప్పటికీ రెండో టెస్టుకు అనూహ్యంగా భువీ స్థానంలో ఇషాంత్‌ను తీసుకున్నారు.

Back to Top