
యూపీ తరఫున సర్ఫరాజ్
ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడిన 17 ఏళ్ల ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తున్నాడుగా.
ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడిన 17 ఏళ్ల ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తున్నాడుగా. అతను అప్పుడే చిన్నపాటి వివాదానికి తావిచ్చాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
ఇందుకోసం ముంబై క్రికెట్ సంఘాన్ని నిరభ్యంతర పత్రం అడిగాడు. చిన్న వయసు నుంచి ప్రతి స్థాయిలోనూ తాము మద్దతుగా నిలిచినందునే సర్ఫరాజ్ భారత్ తరఫున అండర్-19 స్థాయిలో కూడా ఆడగలిగాడని ముంబై అధికారులు అంటున్నారు.