ముగిసిన సాకేత్‌ పోరు | Saketh Myneni knocks out into semi-finals | Sakshi
Sakshi News home page

ముగిసిన సాకేత్‌ పోరు

Nov 18 2017 12:26 AM | Updated on Nov 18 2017 12:26 AM

Saketh Myneni knocks out  into semi-finals - Sakshi

ఈ ఏడాది భారత్‌లో జరుగుతోన్న తొలి ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పుణే ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు, భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని పోరాటం ముగిసింది. శుక్రవారం పుణేలో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో సాకేత్‌ 3–6, 2–6తో రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయాడు.

మరో సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్‌) 6–2, 6–4తో అడ్రియన్‌ మెనెన్‌డెజ్‌ (స్పెయిన్‌)పై నెగ్గి శనివారం రామ్‌కుమార్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు. డబుల్స్‌ సెమీఫైనల్లో సాకేత్‌–జీవన్‌ జంట 4–6, 4–6తో పెడ్రో మార్టినెజ్‌–అడ్రియన్‌ మెనెన్‌డెజ్‌ (స్పెయిన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement