కామెంటరీ బాక్స్‌లో సచిన్‌ | Sachin Tendulkar to make commentary debut | Sakshi
Sakshi News home page

కామెంటరీ బాక్స్‌లో సచిన్‌

Jun 4 2017 1:03 AM | Updated on Sep 5 2017 12:44 PM

కామెంటరీ బాక్స్‌లో సచిన్‌

కామెంటరీ బాక్స్‌లో సచిన్‌

భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరో కొత్త పాత్ర పోషించనున్నారు.

బర్మింగ్‌హామ్‌: భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరో కొత్త పాత్ర పోషించనున్నారు. భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య నేడు జరిగే మ్యాచ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే భాగంలో ఆయన తొలిసారిగా వ్యాఖ్యాతగా మారనున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీ ప్రసారకర్త స్టార్‌ గ్రూప్‌ కేవలం ఈ మ్యాచ్‌ కోసమే తమ కామెంటేటర్స్‌ ప్యానెల్‌లో సచిన్‌ను చేర్చింది.

అయితే ఇంగ్లిష్‌ కామెంటరీ ఐసీసీ చేతుల్లో ఉండటంతో కేవలం ఆయన హిందీ కామెంటరీ బాక్స్‌లోనే కనిపించనున్నారు. కానీ సచిన్‌  మ్యాచ్‌ ఆద్యంతం కామెంటరీ వినిపించరని, ఎక్స్‌పర్ట్స్‌ ప్యానెల్‌లో మాత్రమే భాగంగా ఉంటారని స్టార్‌ గ్రూప్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement