చెన్నై విజయలక్ష్యం 152 | Royals stutter to post 151 Against CSK | Sakshi
Sakshi News home page

చెన్నై విజయలక్ష్యం 152

Apr 11 2019 9:38 PM | Updated on Apr 11 2019 9:40 PM

Royals stutter to post 151 Against CSK - Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 152 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ అజింక్యా రహానే(14) నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో రహానే ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత జోస్‌ బట్లర్‌(23) కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. రాజస్తాన్‌ స్కోరు 47 పరుగుల వద్ద ఉండగా బట్లర్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆపై సంజూ శాంసన్‌(6), రాహుల్‌ త‍్రిపాఠి(10), స్మిత్‌(15)లు సైతం విఫలమయ్యారు. కాగా, బెన్‌ స్టోక్స్‌(28) ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్‌ తేరుకుంది. చివర్లో రియాన్‌ పరాగ్‌(16), జోఫ్రా ఆర్చర్‌(13 నాటౌట్‌), శ్రేయస్‌ గోపాల్‌(19)లు బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు సాధించగా, మిచెల్‌ సాంత్నార్‌కు వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement