బోపన్న జంటకు టైటిల్‌ | Rohan Bopanna and Pablo Cuevas clinch the title | Sakshi
Sakshi News home page

బోపన్న జంటకు టైటిల్‌

Oct 30 2017 4:24 AM | Updated on Oct 30 2017 4:24 AM

Rohan Bopanna and Pablo Cuevas clinch the title

న్యూఢిల్లీ: ఎర్‌స్టీ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న టైటిల్‌ సాధించాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో బోపన్న–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) ద్వయం 7–6 (9/7), 6–7 (4/7), 11–9తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మార్సెలో డెమోలైనర్‌ (బ్రెజిల్‌)–సామ్‌ క్వెరీ (అమెరికా) జంటపై గెలిచింది. 37 ఏళ్ల బోపన్న ఈ ఏడాది సాధించిన మూడో డబుల్స్‌ టైటిల్‌ ఇది.

ఓవరాల్‌గా బోపన్న కెరీర్‌లో ఇది 16వ డబుల్స్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 1,32,030 యూరోల (రూ. 9 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  మరోవైపు ఫ్రాన్స్‌లో జరిగిన బ్రెస్ట్‌ చాలెంజర్‌ టోర్నీ ఫైనల్లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–స్కాట్‌ క్లేటన్‌ (బ్రిటన్‌) ద్వయం 4–6, 5–7తో సాండెర్‌ అరెండ్స్‌ (నెదర్లాండ్స్‌)–అంటోనియో సాన్సిచ్‌ (క్రొయేషియా) జంట చేతిలో ఓడి  రన్నరప్‌గా నిలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement