#మీటూ ఎఫెక్ట్‌: న్యూజిలాండ్‌ క్రికెటర్స్‌ హ్యాండ్‌ బుక్‌లో..

Notes On Sexual Consent In New Zealand Players Handbook - Sakshi

వెల్లింగ్టన్ ‌: పని ప్రదేశాల్లో ఎదురయ్యే వేధింపులపై  ప్రపంచవ్యాప్తంగా #మీటూ పేరిట మహిళలు తమ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ ఆటగాళ్లకు లైంగిక సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమం చేపట్టింది. ఆటగాళ్ల హ్యాండ్‌బుక్‌లో లైంగిక సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తూ మొత్తం 9 కీలక అంశాలను పొందుపరిచింది. గత ఏడేళ్లుగా ఆటగాళ్లకు ఈ బుక్‌ను అందజేస్తున్న అసోషియేషన్‌.. తొలి సారి అందులో ‘గుడ్‌ డిసిషన్‌ మేకింగ్‌’  క్యాప్షన్‌తో  లైంగిక సంబంధాల అంశాన్ని ప్రస్తావించింది.

‘జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో లైంగిక సంబంధాల విషయాల్లో ఇది చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా లైంగిక సమ్మతి కీలకం’  అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. లైంగిక సంబంధాలకు ఒప్పించే క్రమంలో వారికి పూర్తిగా స్వేచ్చనియాలని, వారికిష్టం లేదంటే.. వదిలేయాలని, ఈ విషయంలో వారిపై ఒత్తిడి చేయవద్దని, వారి నిర్ణయాన్ని గౌరవించాలనే  9 కీలక అంశాలను  సూచించారు.

ఫ్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ బాధ్యతలు, ప్రాధాన్యతల గురించి అవగాహన కల్పించేందుకే ఈ అంశాన్ని పొందుపరుస్తూ ఈ పుస్తకాన్ని అప్‌డేట్‌ చేసామని అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ హెత్‌ మిల్స్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే అన్ని రకాల విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top