పాక్‌ ఓటమి.. సెహ్వాగ్‌ ట్వీట్‌ | No One Is An Underdog, Says Virender Sehwag | Sakshi
Sakshi News home page

పాక్‌ ఓటమి.. సెహ్వాగ్‌ ట్వీట్‌

Sep 27 2018 5:07 PM | Updated on Sep 27 2018 5:29 PM

No One Is An Underdog, Says Virender Sehwag - Sakshi

పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించడం పట్ల సెహ్వాగ్‌ స్పందించాడు.

దుబాయ్‌: చిన్న జట్లను తక్కువగా అంచనా వేయొద్దని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ఆసియాకప్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించడం పట్ల సెహ్వాగ్‌ స్పందించాడు. చాలా మంది ఊహించినట్టుగా ఫలితం రాలేదన్నాడు. ‘ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. అభిమానులు కోరుకున్నట్టుగా జరగలేదు. ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్ తలపడతాయని చాలా మంది ఊహించారు. కానీ అలా జరగలేదు. ఈరోజు బంగ్లాదేశ్‌ అద్భుతంగా ఆడింది. ముష్ఫికర్‌, మిథున్‌, ముస్తాఫిజుర్‌, మహ్మదుల్లా, మెహిదీ సత్తా చాటారు. పాకిస్తాన్‌కు అదృష్టం కలిసిరాలేద’ని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

ఆసియాకప్‌లో పాకిస్తాన్‌ జట్టు ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. అన్ని రంగాల్లో పాక్‌ జట్టు విఫలమైందన్నాడు. కుర్రాళ్లతో కూడిన జట్టు గత టోర్నమెంట్‌లో బాగా ఆడిందని, దీంతో అంచనాలు పెరిగాయన్నాడు. పాకిస్తాన్‌ జట్టు పుంజుకోవాలంటే ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించాడు. బంగ్లాదేశ్‌ టీమ్‌కు అభినందనలు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement