జేమీసన్‌కు తొలిసారి చోటు  | New Zealand Contract List Released | Sakshi
Sakshi News home page

జేమీసన్‌కు తొలిసారి చోటు 

May 16 2020 3:07 AM | Updated on May 16 2020 3:07 AM

New Zealand Contract List Released - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ తాజా సంచలనం కైల్‌ జేమీసన్‌కు న్యూజిలాండ్‌ క్రికెట్‌ 2020–21 సీజన్‌కుగానూ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన సిరీస్‌ ద్వారా వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల జేమీసన్‌ అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర వన్డేలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడంతో పాటు... అనంతరం జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 9 వికెట్లతో పాటు బ్యాట్‌తోనూ రాణించి కివీస్‌ సిరీస్‌ను 2–0 తో క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడితో పాటు ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్, డేవన్‌ కాన్వేలు కూడా తొలిసారి ఈ జాబి తాలో చోటు దక్కించుకోగా... ఓపెనర్‌ మన్రో, జీత్‌ రావల్, ఇటీవల టెస్టుల నుంచి రిటైరైన టాడ్‌ ఆస్టల్‌లు తమ కాంట్రాక్టును కోల్పోయారు. మొత్తం 20 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టు లభించింది.
న్యూజిలాండ్‌ కాంట్రాక్ట్‌ క్రికెటర్ల జాబితా: విలియమ్సన్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, ఫెర్గూసన్, గప్టిల్, హెన్రీ, జేమీసన్, టామ్‌ లాథమ్, నికోల్స్, సాన్‌ట్నెర్, నీషమ్,  సౌతీ, రాస్‌ టేలర్, వాగ్నర్, వాట్లింగ్, ఎజాజ్‌ పటేల్, సోధి, బ్లన్‌డెల్, డేవన్‌ కాన్వే, విల్‌ యంగ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement