జాతీయస్థాయి తైక్వాండోలో గాయత్రికి స్వర్ణం | National taikvandolo gayatriki gold | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి తైక్వాండోలో గాయత్రికి స్వర్ణం

Oct 22 2014 1:12 AM | Updated on Sep 2 2017 3:13 PM

జాతీయస్థాయి తైక్వాండోలో గాయత్రికి స్వర్ణం

జాతీయస్థాయి తైక్వాండోలో గాయత్రికి స్వర్ణం

సైదాబాద్: నగరానికి చెందిన గాయత్రి జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో మెరిసింది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె బంగారు పతకం సాధించింది.

 సైదాబాద్: నగరానికి చెందిన గాయత్రి జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో మెరిసింది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె బంగారు పతకం సాధించింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫిట్‌జీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఆమె జూనియర్ విభాగంలో చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ ఈవెంట్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది అమ్మాయిలు పోటీపడగా గాయత్రి అగ్రస్థానంలో నిలవడం విశేషం.

పసిడి పతకంతో నగరానికి తిరిగొచ్చిన ఆమెను స్కూల్ ప్రిన్సిపాల్ పి. చంద్రశేఖర్‌రావు, యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. తైక్వాండోతో పాటు ఇతర క్రీడల్లోనూ రాణించేందుకు తమ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తున్నట్లు చంద్రశేఖర్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement