టీ విరామం: రహానె ఔట్‌.. భారత్‌ 114/4 | Morkel Sends Back Ajinkya Rahane | Sakshi
Sakshi News home page

Jan 24 2018 6:31 PM | Updated on Jan 24 2018 6:32 PM

Morkel Sends Back Ajinkya Rahane - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. తొలి రెండు టెస్టు మ్యాచుల్లో అవకాశం దక్కని అజింక్యా రహానేకు సీనియర్‌ క్రికెటర్ల విమర్శల నేపథ్యంలో ఈమ్యాచ్‌లో అవకాశం కల్పించగా అతను తీవ్రంగా నిరాశపరిచాడు.

మోర్కెల్‌ వేసిన 51.4 ఓవర్‌లో రహానే(9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకు ముందు కెప్టెన్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించి వెంటనే అవుటయ్యాడు. కోహ్లి ఉన్నంత సేపు నిలకడగా సాగిన భారత బ్యాటింగ్‌ అనంతరం కుదేలైంది. సఫారీ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్‌మన్‌ పరుగుల కోసం శ్రమిస్తున్నారు. ఇక టీ విరామ సమయానికి భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(27), పార్దీవ్‌ పటేల్‌(0)లున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement