షమీ షేక్; కివీస్కు బ్రేక్ | Mohammed shami collapsed New Zealand batting order | Sakshi
Sakshi News home page

షమీ షేక్; కివీస్కు బ్రేక్

Jan 19 2014 10:08 AM | Updated on Apr 4 2019 5:25 PM

షమీ షేక్; కివీస్కు బ్రేక్ - Sakshi

షమీ షేక్; కివీస్కు బ్రేక్

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడ ప్రారంభమయిన తొలి వన్డేలో భారత్కు న్యూజిలాండ్ 293 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

నేపియర్: ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడ ప్రారంభమయిన తొలి వన్డేలో భారత్కు న్యూజిలాండ్ 293 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది.

విలియమ్సన్(71), టేలర్(55), ఆండర్సన్(68) అర్థ సెంచరీలతో రాణించారు. 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ను వీరు ఆదుకున్నారు. మెక్ కల్లమ్ 30, రోంచి 30, రైడర్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ పదునైన బౌలింగ్తో కివీస్ ఆటగాళ్ల జోరుకు కళ్లెం వేశాడు. 4 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, జడేజా తలో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement