'మహిళా క్రికెట్ లో ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించండి' | Mithali Raj requests BCCI for more women's Tests | Sakshi
Sakshi News home page

'మహిళా క్రికెట్ లో ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించండి'

Jun 5 2014 7:02 PM | Updated on Sep 2 2017 8:21 AM

'మహిళా క్రికెట్ లో ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించండి'

'మహిళా క్రికెట్ లో ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించండి'

భారత్ లో మహిళల టెస్ట్ క్రికెట్ ఆదరణ తగ్గకుండా ఉండాలంటే తగినన్ని ఎక్కువ టెస్టు మ్యాచ్ లు నిర్వహించాలని హైదరాబాద్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ అభిప్రాయపడింది.

హైదరాబాద్:భారత్ లో మహిళల టెస్ట్ క్రికెట్ ఆదరణ తగ్గకుండా ఉండాలంటే తగినన్ని ఎక్కువ టెస్టు మ్యాచ్ లు నిర్వహించాలని హైదరాబాద్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. భారత్ మహిళా క్రికెట్ లో 148 వన్డేలు ఆడిన 31 ఏళ్ల మిథాలీ రాజ్.. ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది టెస్టు మ్యాచ్ లనే ఆడింది. 'నేను 8 ఏళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్ ఆడాను. అందులో 214 పరుగులు చేశాను.  అప్పట్నుంచి ఇప్పటి వరకూ టెస్టు మ్యాచ్ ఆడలేదు. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు నిర్వహిస్తే భారత మహిళా క్రికెట్ కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుంది' అని మిథాలీ పేర్కొంది. దీనిపై బీసీసీఐ తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 

ఇప్పటివరకూ మహిళా టెస్టు మ్యాచ్ లు జరిగిన సందర్భాలు తక్కువ. త్వరలో ఇంగ్లండ్ టూర్ కు బయల్దేరనున్నభారత మహిళలు జట్టు ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement