మెరుగుపడుతున్నప్పటికీ... | Michael Schumacher showing signs of improvement, say doctors | Sakshi
Sakshi News home page

మెరుగుపడుతున్నప్పటికీ...

Jan 1 2014 2:28 AM | Updated on Sep 2 2017 2:09 AM

మైకేల్ షుమాకర్

మైకేల్ షుమాకర్

స్కీయింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడుతోందని అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు.

గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడుతోందని అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. అయితే ఓవరాల్‌గా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, క్రితం రాత్రి తనకు రెండో శస్త్ర చికిత్స నిర్వహించినట్టు చెప్పారు.
 
  అత్యంత కీలకమైన ఈ చికిత్సకు ముందు డాక్టర్లు షుమాకర్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మాజీ చాంపియన్ కోమాలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తను విషమస్థితిలోనే ఉన్నాడని, అయితే స్వల్పంగానైనా అతడు మెరుగుపడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందని, మున్ముందు పరిస్థితిపై మాత్రం అంచనాకు రాలేమని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్ జీన్ ఫ్రాంకోయిస్ పయేన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement