కొద్దిగా మెరుపడ్డ షుమాకర్ ఆరోగ్యం | Michael Schumacher improving but 'not out of danger': doctors | Sakshi
Sakshi News home page

కొద్దిగా మెరుపడ్డ షుమాకర్ ఆరోగ్యం

Dec 31 2013 4:56 PM | Updated on Sep 2 2017 2:09 AM

కొద్దిగా మెరుపడ్డ షుమాకర్ ఆరోగ్యం

కొద్దిగా మెరుపడ్డ షుమాకర్ ఆరోగ్యం

ఫార్ములావన్ డ్రైవింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగు పడింది. అయితే ప్రాణాప్రాయం తప్పిందని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు.

గ్రెనోబల్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ డ్రైవింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగు పడింది. అయితే ప్రాణాప్రాయం తప్పిందని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. అతడికి చేసిన రెండో ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపారు. షుమాకర్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగయిందన్నారు. ఇప్పటికే అతడి మెదడుకు శస్త్ర చికిత్స చేశారు.

ఫార్ములావన్లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నీరాజనాలు అందుకున్నషుమాకర్ ఆదివారం స్కీయింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఆల్ఫ్స్‌లోని మెరిబెల్ రిసార్ట్‌లో 14 ఏళ్ల తన కుమారుడితో కలిసి స్కీయింగ్ చేస్తుండగా షుమాకర్ తలకు దెబ్బ తగిలింది. దీంతో అతడు కోమాలోకి వెళ్లాడు.

1991లో ఎఫ్1లో అరంగేట్రం చేసిన తను అందరికన్నా ఎక్కువగా ఏడుసార్లు ఫార్ములావన్ టైటిళ్లు, 91 రేసులు నెగ్గి చరిత్ర సృష్టించాడు. 2004లో చివరిసారి చాంపియన్‌గా నిలిచిన తను గతేడాది పూర్తిగా రేస్ నుంచి తప్పుకున్నాడు. వచ్చే శువ్రారం తను 45వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement