చాంప్స్‌ మహతి, శ్రీశ్వాన్‌ | mahathi, Sree Swan got chess titles | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ మహతి, శ్రీశ్వాన్‌

Oct 12 2017 10:11 AM | Updated on Oct 12 2017 10:11 AM

mahathi, Sree Swan got chess titles

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్‌ చాంపియన్‌షిప్‌లో సాయి మహతి, శ్రీశ్వాన్‌ విజేతలుగా నిలిచారు. మణికొండలోని ఐడియల్‌ చెస్‌ అకాడమీలో బుధవారం జరిగిన అండర్‌–11 బాలికల పోటీల్లో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, అత్తాపూర్‌కు చెందిన సాయి మహతి, ప్రగతి సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థి జి. కీర్తి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

బాలుర విభాగంలో శ్రీశ్వాన్‌ (కెన్నడీ హై ది గ్లోబల్‌ స్కూల్, బాచుపల్లి) మొదటిస్థానంలో, అమిత్‌ (ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌) రెండో స్థానంలో నిలిచారు. ఈ నలుగురు క్రీడాకారులు రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టు వరంగల్‌లో ఈనెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్‌–11 చెస్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement