ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ 134 | KKR Set Target of 134 Runs Against Mumbai Indians | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ 134

May 5 2019 9:48 PM | Updated on May 5 2019 9:50 PM

KKR Set Target of 134 Runs Against Mumbai Indians - Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 134 పరుగుల సాధారణ టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ పరుగులు సాధించడానికి అపసోపాలు పడింది. ముంబై బౌలర్లు పదునైన బంతులు వేయడంతో కేకేఆర్‌ ఓపెనర్లు క్రిస్‌ లిన్‌, శుభ్‌మన్‌ గిల్‌లు శ్రమించాల్సి వచ్చింది. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద ఉండగా గిల్‌(9) తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

ఆపై కాసేపటికి లిన్‌(41; 29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్‌ కావడంతో కేకేఆర్‌ 56 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఇక కేకేఆర్‌ ఆటగాళ్లలో దినేశ్‌ కార్తీక్‌(3) నిరాశ పరచగా, రసెల్‌లు డకౌట్‌ కావడంతో ఆ జట్టు స్కోరు నత్తనడకన సాగింది. రాబిన్‌ ఊతప్ప(40;47 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా, నితీష్‌ రాణా(26; 13 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించాడు. దాంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో మలింగా మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలు తలో రెండు వికెట్లు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement