
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విధ్వంసకర కింగ్స్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ మరో ఘనత సాధించాడు. సోమవారం సవాయ్ మాన్ సింగ్ మైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వేల పరుగులు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో డేవిడ్ వార్నర్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల పరుగుల అందుకున్న ఆటగాడిగా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. క్రిస్‌గేల్ 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(114), విరాట్ కోహ్లి(128), సురేష్ రైనా, గంభీర్(140)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.