కరాటే ప్లేయర్‌ డింపుల్‌కు కార్వీ ప్రోత్సాహం | karvy organisation financial support to karate player dimple | Sakshi
Sakshi News home page

కరాటే ప్లేయర్‌ డింపుల్‌కు కార్వీ ప్రోత్సాహం

Mar 30 2018 10:32 AM | Updated on Mar 30 2018 10:32 AM

karvy organisation financial support to karate player dimple - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరాటే క్రీడలో ప్రతిభ కనబరుస్తోన్న క్రీడాకారిణి సూరపనేని డింపుల్‌ను ప్రోత్సహించేందుకు కార్వీ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో త్వరలో జరుగనున్న ఓపెన్, జూనియర్‌ ఇంటర్నేషనల్‌ కప్‌ టోర్నమెంట్‌లో డింపుల్‌ 65 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

ఈ నేపథ్యంలో ఆమె శిక్షణ కోసం కార్వీ సంస్థ ఆర్థిక సహాయం అందించింది. బుధవారం కార్వీ ఎండీ ఎం. యుగంధర్‌ ఆమెకు లక్ష రూపాయల చెక్‌ను అందించారు. గతంలో మలేసియాలో జరిగిన నైట్‌ ఇంటర్నేషనల్‌ కరాటే కప్‌లో డింపుల్‌ స్వర్ణాన్ని సాధించింది. జాతీయ స్థాయిలోనూ పలు టోర్నీల్లో విజేతగా నిలిచిన డింపుల్‌... 13 ఏళ్ల వయసులోనే కరాటే షోడాన్‌ టైటిల్‌ను సాధించింది. ప్రస్తుతం విజయవాడలో బీఈ కంప్యూటర్స్‌ చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement