ఆడు మగాడ్రా బుజ్జి.. 90 సెకన్లలో రెండు గోల్స్‌

Japan Player Two Similar Blunders In The Span of 90 Seconds - Sakshi

తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన బిగిల్ చిత్రం తెలుగులో విజిల్ అనే పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను తెగఆకట్టుకుంటోంది. విజిల్‌ మూవీ క్లైమాక్స్‌లో భాగంగా జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో హీరో విజయ్‌ టీమ్‌ ప్లేయర్స్‌ చేసే గోల్స్‌ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అయితే ప్రస్తుతం ‘విజిల్‌’ క్లైమాక్స్‌ లోని కొన్ని సీన్స్‌ జపాన్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో కనపడ్డాయి. 

మంగళవారం జపాన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇది కాస్త అటు ఇటుగా విజిల్‌ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. మైదానం సెంటర్‌ పాయింట్‌ నుంచి ఏకంగా ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడి చేసి ఓ ప్లేయర్‌ గోల్‌ సాధించాడు. ఈ షాక్‌ నుంచి ప్రత్యర్థి జట్టు కోలుకునేలోపే సేమ్‌ సీన్‌ రిపీటయింది. కేవలం 90 సెకన్ల వ్యవధిలో ఎవరూ ఊహించని విధంగా గోల్స్‌ సమర్పించుకోవడంతో ప్రత్యర్థి జట్టు గోల్‌ కీపర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కాగా, కేవలం 90 సెకన్ల వ్యవధిలో రెండు షాకింగ్‌ గోల్స్‌ చేసిన ఆ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ‘ఆడు మగాడ్రా బజ్జి.. 90 సెకన్లలో రెండు గోల్స్‌ చేశాడు’, ‘ఆ గోల్‌ పోస్టులను ఇంకొంచెం దూరం పెట్టండి లేకుంటే కష్టం’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top