సెమీస్‌లో ఐరాసూద్, సౌమ్య | irasood enters semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఐరాసూద్, సౌమ్య

Feb 25 2017 10:33 AM | Updated on Sep 5 2017 4:35 AM

తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఐరాసూద్, సౌమ్య సెమీఫైనల్‌కు చేరుకున్నారు.

మాస్టర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఐరాసూద్, సౌమ్య సెమీఫైనల్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్‌ థామస్‌ హైస్కూల్‌లో శుక్రవారం జరిగిన అండర్‌–16 బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఐరాసూద్‌ 8–0తో నేహారెడ్డిపై గెలుపొందగా, సౌమ్య 8–0తో కీర్తి ఆనంద్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నిహారిక 8–4తో అనికా కారంపూడిపై, ఆకాంక్ష 8–2తో ఖ్యాతిపై విజయం సాధించారు. బాలుర సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో రిత్విక్‌ 8–3తో చక్రవర్తిపై, వేదాంత్‌ మిశ్రా 8–2తో ఆదిత్యరెడ్డిపై గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.

ఇతర తొలిరౌండ్‌ మ్యాచ్‌ల ఫలితాలు: రోహిత్‌ సాయిశరణ్‌ 8–4తో ధ్రువ్‌పై, ప్రతినవ్‌ 8–1తో ఠాకూర్‌ ఆర్మాన్‌ సింగ్‌పై, హేమంత్‌సాయి 8–3తో ఆర్యన్‌పై, సిద్ధాంత్‌ మిశ్రా 8–2తో రితిక్‌పై, ఆర్నవ్‌ కుమార్‌ 8–3తో కోట శ్రీనాథ్‌పై, లలిత్‌ మోహన్‌ 8–3తో సనీత్‌పై, కౌశిక్‌ కుమార్‌ 8–0తో సంపత్‌పై, వర్షిత్‌ కుమార్‌ 8–2తో మోహిత్‌ సాయి చరణ్‌ రెడ్డిపై గెలుపొందారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement