ఐపీఎల్-7: సన్ రైజర్స్ విజయం | IPL-7: Hyderabad beats Delhi | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: సన్ రైజర్స్ విజయం

May 10 2014 8:38 PM | Updated on Sep 2 2017 7:11 AM

ఐపీఎల్-7లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఎనిమిది వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విజయం సాధించింది.

ఐపీఎల్-7లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఎనిమిది వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై  విజయం సాధించింది. 5 ఓవర్లలో 43  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మరో నాలుగు బంతులు మిగిలుండగా గెలుపొందింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని పలుమార్లు కుదించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 143 పరుగులు సాధించింది.  దినేష్ కార్తీక్ 39, పీటర్సన్ 35, అగర్వాల్ 25, లక్ష్మీ శుక్లా 21 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లు స్టెయిన్, అమిత్ మిశ్రా, హెన్రిక్స్ రెండేసి వికెట్లు తీశారు. కాగా ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 103 పరుగుల స్కోరుతో ఉన్న సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తెరిపి ఇచ్చాక మళ్లీ మ్యాచ్ కొనసాగించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement