ఐపీఎల్‌-12వ సీజన్‌ మార్చిలోనే..

IPL-12 Season Likely To Begin On March 29 Next Year - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 (ఐపీఎల్‌ ) సంబరం అయిపోయింది. కానీ, ప్రేక్షకులు మాత్రం అప్పుడే వచ్చే ఐపీఎల్‌ గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈసారి ఐపీఎల్‌-12వ సీజన్‌ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్‌ కప్‌ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్‌ కప్‌తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 

ఇంగ్లాండ్‌ వేదికగా వరల్డ్‌ కప్‌ మే 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా ప్లేయర్స్‌ నిబంధనల ప్రకారం ఒక టోర్ని అయిపోయినత తర్వాత మరో టోర్నీలో మ్యాచ్‌ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్‌-12వ సీజన్‌ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లోని వేల్స్‌ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్‌ కప్‌ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్‌ ఏప్రిల్‌ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. 

కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్‌ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్‌ ప్లేయర్స్‌కు వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్‌ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న  ఐపీఎల్‌ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్‌-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్‌ సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కష్టమవతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌-11వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కప్‌ కైవసం చేసుకున్న విషయం విదితమే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top