డోపీలు సుమీత్, రవి | Indian Boxer Sumith Sangwan Excels Internationally | Sakshi
Sakshi News home page

డోపీలు సుమీత్, రవి

Dec 12 2019 2:05 AM | Updated on Dec 12 2019 2:06 AM

Indian Boxer Sumith Sangwan Excels Internationally - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బాక్సర్‌ సుమీత్‌ సాంగ్వాన్‌... షూటర్‌ రవి కుమార్‌ డోపింగ్‌ పరీక్షల్లో పట్టుబడ్డారు. వీరిద్దరు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఔషధాల జాబితాలో ఉన్నవాటిని వినియోగించినట్టు డోప్‌ పరీక్షల్లో తేలింది. సుమీత్‌ 2017 ఆసియా ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచాడు. సుమీత్‌ ఎక్టెజోలామైడ్‌ ఉత్ప్రేరకం వాడినట్లు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. గత ఏడాది జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన షూటర్‌ రవి కుమార్‌ ప్రొప్రానోలోల్‌ ట్యాబ్లెట్‌ను వాడినట్లు డోప్‌ పరీక్షలో తేలింది. మైగ్రేన్‌ తలనొప్పి వచ్చినపుడు డాక్టర్‌ వద్దకు వెళ్లగా అతను ఈ ట్యాబ్లెట్‌ రాసిచ్చాడని రవి తెలిపాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement